YS Jagan: లాబీయింగ్ కోసమా.. నిజంగా ఆశీర్వాదమా.. ఎవరీ విజయ్‌కుమార్ స్వామీ.. జగన్‌కు తలపోటు తప్పదా ?
ఏపీలో అన్ని విషయాలు పక్కకుపోయాయ్ ఇప్పుడు.. ఒక్క వివేకా హత్య కేసు తప్ప! భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అవినాశ్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుందన్నది టెన్షన్ పుట్టిస్తోంది. ఈ నెల 25వరకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దని కోర్టు తీర్పు ఇచ్చినా.. ఆ తర్వాత ఏం జరగబోతోందన్న ఆందోళన.. వైసీపీ శ్రేణులను వెంటాడుతోంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్ అంటే.. ఓ ఎంపీనో, ఓ వ్యక్తినో అరెస్ట్ చేయడం కాదు.. వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం.. అదీ పదవిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం.. అదే జరిగితే వైసీపీకి ఇబ్బందులు తప్పవు.