India Canada Row: ఇండియా-కెనడా వివాదం.. కెనడా వైఖరే కారణమా..? అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందా..?
గత జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. తమ దేశ పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేకాదు.. భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. దీంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది.