పోటీ చేస్తే అపజయం ఎరుగని నేతగా సబితకు రికార్డు ఉంది. మొన్నటి ఎన్నికల్లో కూడా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్‌పై 26,187 ఓట్ల తేడాతో గెలిచారు.
