ఏంటి… ఇంట్లో కిచెన్లు తీసేశారా… అసలు వండుకోవడం మానేశారా హైదరాబాద్ సిటీ జనం. ఇప్పుడు సిటీ జనాన్ని ఇలాగే అడగాల్సి వస్తోంది. ఎందుకంటే… న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం కేకుల కంటే బిర్యానీలకే రికార్డు స్థాయిలో ఆర్డర్స్ వస్తున్నాయి. బిర్యానీలకు డిమాండ్ పెరగడంతో… ఇప్పుడు చాలా హోటళ్ళు టెంట్లు వేసి మరీ అమ్మకాలు మొదలుపెట్టాయి.
