కావాలంటే మాతో సె*క్స్‌ చేయండి రే*ప్‌లు చేయొద్దంటూ సె*క్స్‌ వర్కర్ల ర్యాలీ

కలకత్తాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై సెక్స్ వర్కర్లు కూడా కదం తొక్కారు. ఇలాంటి అఘాయిత్యాలు చేయొద్దంటూ కలకత్తాలో భారీ ప్రదర్శనలు చేస్తున్నారు. కలకత్తాలోని సోనాగచి ప్రాంతం సెక్స్ వర్కర్లకు ప్రసిద్ధి. RGకార్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ ఘటనకు వ్యతిరేకంగా అక్కడి సెక్స్ వర్కర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ కుటుంబానికి తమ సంఘీభావం తెలిపారు. ఉద్వేగానికి లోనైన సెక్స్ వర్కర్ల ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు చేయొద్దు, మహిళల్ని వేదించవద్దని వేడుకున్నారు. అలాంటి శారీరక […]

Post Published By: Vencateshg
Updated : 23 August 2024, 4:36 PM IST

కలకత్తాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై సెక్స్ వర్కర్లు కూడా కదం తొక్కారు. ఇలాంటి అఘాయిత్యాలు చేయొద్దంటూ కలకత్తాలో భారీ ప్రదర్శనలు చేస్తున్నారు. కలకత్తాలోని సోనాగచి ప్రాంతం సెక్స్ వర్కర్లకు ప్రసిద్ధి. RGకార్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ ఘటనకు వ్యతిరేకంగా అక్కడి సెక్స్ వర్కర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ కుటుంబానికి తమ సంఘీభావం తెలిపారు. ఉద్వేగానికి లోనైన సెక్స్ వర్కర్ల ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు చేయొద్దు, మహిళల్ని వేదించవద్దని వేడుకున్నారు. అలాంటి శారీరక అవసరాల కోసం అయితే తామున్నామంటూ ఎమోషనల్‌ అయ్యారు. అలాంటి శారీక అవసరాలు తీర్చుకోవాలి అనుకునేవాళ్లు రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లాలి కానీ అభంశుభం తెలియని అమ్మాయిలను ఎందుకు బలి చేస్తున్నారంటూ ప్రశ్నించారు. బలవంతంగా ఎవరినైనా రేప్ చేయడం మంచిది కాదన్నారు. సోనాగచి ఏరియా దేశంలోనే ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఉండే ప్రాంతంగా గుర్తింపు పొందింది. సోనాగచ్చి రెడ్‌లైట్ ఏరియాలో సుమారు 11 వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఇక్కడకు రోజూ 30 వేల మంది విటులు వస్తుంటారని అంచనా. వీరంతా విధి లేక ఈ వృత్తిలోకి వచ్చారు. వ్యభిచారం చట్టబద్ధం కాకపోయినప్పటికీ. ఈ విషయంలో వారి ఉపాధిని ప్రభుత్వాలు దెబ్బతీయవు. ఇది కలకత్తాలో చాలా ఒపెన్‌గా జరిగే వ్యవహారం. మహిళలపై జరుగుతున్న అరాచకాలతో వీళ్లు కూడా మథన పడుతున్నారు. అందుకే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డాక్టర్‌ న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు.

Published : 
  • 23 August 2024, 4:36 PM IST

Topics :