పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ప్యూర్టోరికో రెజ్లర్ క్రూజ్ పై 13-5తేడాతో విజయం సాధించాడు. బౌట్‌లోకి దిగినప్పటి నుంచే సెహ్రావత్ సత్తా చాటాడు. తన పట్టు ఏంటో మరోసారి నిరూపించాడు. హరియాణాకు చెందిన అమన్ సెహ్రావత్ తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే కాంస్య పతకం సాధించి భారత్‌ను సగర్వంగా అంతర్జాతీయ వేదికపై నిలబెట్టాడు. ఇక 21 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పాల్గొని 57 కేజీల […]
