ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2024 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. 2 కోట్ల కనీస ధరతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరు పై పోటా పోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్, ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది.

Australian fast bowler, captain Pat Cummins was sold for a record price in the IPL 2024 mini auction.