శభాష్ జైశ్వాల్ భారత ఓపెనర్ రికార్డ్

ఫార్మాట్ తో సంబంధం లేకుండా భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దుమ్మురేపుతున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 20 September 2024, 8:43 PM IST

ఫార్మాట్ తో సంబంధం లేకుండా భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దుమ్మురేపుతున్నాడు. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. అరంగేట్రం నుంచే సంచలన ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్న జైశ్వాల్ తాజాగా 147 ఏళ్ళ అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. కెరీర్ లో తొలి 10 ఇన్నింగ్స్ లలో 750 కి పైగా రన్స్ చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో విండీస్ ప్లేయర్ జార్జ్ హిడ్లీ పేరిట ఈ రికార్డు ఉండేది. బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన జైశ్వాల్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అత్యధిక పరుగులు జాబితాలోనూ జైశ్వాల్ దూసుకెళుతున్నాడు.

Published : 
  • 20 September 2024, 8:43 PM IST