ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా శ్రీలంకను ఓడించింది. తద్వారా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. 49వ ఓవర్‌లో ధోనీ బాదిన సిక్స్‌తో భారత్ ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
