యూఎస్ ఓపెన్ లో మరో సంచలనం మూడో రౌండ్ లోనే జకోవిచ్ ఔట్

ఏడాది చివరి గ్రాండ్‌‌స్లామ్ లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. నిన్న అల్కరాజ్ ఇంటిదారి పడితే...

Post Published By: Vencateshg
Updated : 31 August 2024, 8:30 PM IST

ఏడాది చివరి గ్రాండ్‌‌స్లామ్ లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. నిన్న అల్కరాజ్ ఇంటిదారి పడితే... తాజాగా సెర్బియన్ స్టార్ డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జకోవిచ్ కూడా నిష్క్రమించాడు. అనూహ్యంగా మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన 28వ సీడ్‌ అలెక్సీ పాప్రియన్‌ చేతిలో 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో ఓడిపోయాడు. గత 18 ఏళ్లలో యూఎస్‌ ఓపెన్‌‌లో నాలుగో రౌండ్‌కు చేరకుండానే జకోవిచ్‌ నిష్క్రమించడం ఇదే తొలిసారి. దీంతో అత్యధికంగా 25 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాలనుకున్న జకోవిచ్ ఆశలు నెరవేరలేదు.

Published : 
  • 31 August 2024, 8:30 PM IST

Topics :