నువ్వు తోపులకే తోపు అశ్విన్ పై ప్రశంసల జల్లు

బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో సెంచరీ బాదిన రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Post Published By: Vencateshg
Updated : 20 September 2024, 8:45 PM IST

బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో సెంచరీ బాదిన రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. రోహిత్, గిల్, కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్లు తడబడిన చెపాక్ పిచ్ పై అశ్విన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఏదో గాలివాటం ఇన్నింగ్స్ లా కాకుండా క్లాసిక్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడిన ఇన్నింగ్స్ ఎప్పుడూ విలువ ఉంటుంది. అలాంటి వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ 113 పరుగులకు ఔటయ్యాడు. భారత్ స్కోర్ కనీసం 200 కూడా కష్టమే అనుకున్న దశలో 376 రన్స్ చేసిందంటే అశ్విన్ బ్యాటింగే కారణం. జడేజాతో కలిసి కీలకపార్టనర్ షిప్ తో జట్టుకు భారీస్కోరు అందించిన అశ్విన్ తోపులకే తోపు అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

Published : 
  • 20 September 2024, 8:45 PM IST