ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ స్టార్… ప్లేయర్స్ కు లంక బోర్డు షాక్…!

స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ 16 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది.

  • Written By:
  • Publish Date - January 29, 2026 / 06:09 PM IST

స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ 16 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ దాసున్ షనక నాయకత్వం వహించనున్నాడు. ఇంగ్లండ్‌తో జరగిన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన పవన్ రత్నాయకేకు టీ20 జట్టులో కూడా చోటు దక్కింది.

సీనియర్ బ్యాటర్ కుశాల్ పెరీరాకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. పేలవమైన ప్రదర్శన కారణంగా పేసర్ నువాన్ తుషార, ఆల్ రౌండర్ కమిందు మెండిస్, లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంతలపై సెలెక్ట‌ర్లు వేటు వేశారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైన 16 మంది సభ్యులే దాదాపుగా శ్రీలంక‌ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ స్క్వాడ్‌లో ఉండే అవకాశం ఉంది.