మ్యాచ్ విన్నర్ ను వదిలేశారు… చెన్నై సూపర్ కింగ్స్ పై విమర్శలు…!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కుర్రాడు సమీర్ రిజ్వీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగి రెండింటిలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.