బీజేపీ

INDIA Alliance : ఇండియా కూటమిలో సీట్ల లొల్లి….ఎవరికి వారే – యమునా తీరే !

INDIA Alliance : ఇండియా కూటమిలో సీట్ల లొల్లి….ఎవరికి వారే – యమునా తీరే !

లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసి… ప్రధాని నరేంద్రమోడీని అధికారం నుంచి దింపాలని పెద్ద పెద్ద కంకణాలు కట్టుకున్నారు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు.  కానీ ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం.  దేశవ్యాప్తంగా సీట్ల పంపిణీ విషయంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి.  మొన్న మహరాష్ట్రలో శివసేన, నిన్న పంజాబ్ లో ఆప్ పార్టీ… ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. అవసరమైతే ఒంటరిగా అయినా పోరుకు వెళ్తామని అల్టిమేటం జారీ చేస్తున్నాయి.