వైసీపీ

CHINNA SRINU : చిన్న శ్రీను అరాచకాల ఫలితం….  విజయనగరం జిల్లాలో వైసీపీ ఫినిష్ !

CHINNA SRINU : చిన్న శ్రీను అరాచకాల ఫలితం…. విజయనగరం జిల్లాలో వైసీపీ ఫినిష్ !

చిన్న శ్రీను అలియాస్ డాన్ శ్రీను. ఆ పేరు వింటే విజయనగరం జిల్లా వణికిపోతోంది. సామాన్య జనం, అధికారులు, లీడర్స్ అందరికీ చిన్న శ్రీను పేరు చెప్తే దడ. వేళ్లతో సైగచేస్తాడు…  చూపుతో శాసిస్తాడు… రాబందులా మింగేస్తాడు… ఆయనకి ఊక, తవుడు, నూక కాదేదీ వ్యాపారానికి అనర్హం. భూముల‌ సెటిల్మెంట్ నుంచి  వీధి తగాదా దాకా అన్నింటా డాన్ శ్రీను ప్రమేయమే.. దేన్నయినా తెంపగలడు.. కుదరకపోతే లాక్కోగలడు. ఆయన చెప్పిన దానికి అధికారులు కూడా తలాడించాల్సిందే. లేకుంటే బదిలీ ఖాయం. ఆ జిల్లాకు ఓ నరకాసురుడుగా విరాజిల్లుతున్నాడని విజయనగరం పబ్లిక్ టాక్.