విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చిన్నబాబు నిర్మిస్తున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ సినిమాకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
తెలుగు చిత్రసీమలో తనదైన మాటల చాతుర్యంతో, పదునైన సంభాషణలతో, భావోద్వేగపూరిత సన్నివేశాలతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరిస్తూ ‘మాటల మాంత్రికుడు’గా తన పేరును ముద్రించుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్.. ఈ ఇద్దరి పేర్లు వింటేనే మనకు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలు గుర్తొస్తాయి.