Pushpa 3 : ‘పుష్ప3’గుట్టుగా మొదలెట్టేసారు భయ్యా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే.. ఉత్తరాదిని కూడా ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంతో బన్నీ ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది.. పుష్ప మూవీలోని అల్లు అర్జున్ మేనరిజం కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించిపెట్టింది. ఈ మూవీతో బన్నీ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.