India vs Pakistan : అహ్మదాబాద్ గడ్డ అశ్విన్ అడ్డా..
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల చూపంతా ఇప్పుడు భారత్-పాక్ మ్యాచ్ పైనే ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించి ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. పాక్ బౌలింగ్ దళానికి.. భారత బ్యాటింగ్ వీరులకు మధ్య ఈ పోరు జరగనుందని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఇటు అభిమానులు దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారా అని లెక్కలు వేస్తున్నారు.