Chandra Babu as AP CM: దటీజ్ చంద్రబాబు…. సీఎం కుర్చీలో నాలుగోసారి !
బాబు ఈజ్ బ్యాక్! ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కున్నారు! ఎక్కడ అవమానం పాలయ్యారో అక్కడే అధికారం సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆయనకు కొత్త కాదు. మూడు సార్లు సీఎంగా పనిచేశారు. ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా బాబే! రాబోయే ఐదేళ్లు కలుపుకుంటే సీఎంగా ఆయన 19 ఇయర్స్ ఇండస్ట్రీ!