Raja Reddy Engagement : రేపే షర్మిల కొడుకు ఎంగేజ్ మెంట్.. జగన్ కుటుంబం వస్తోందా ?
వైఎస్ షర్మిల (YS Sharmila) కొడుకు పెళ్ళి నిశ్చితార్థం (son’s wedding) జనవరి 18న హైదరాబాద్ లోని గోల్గొండ రిసార్ట్స్ లో జరగబోతోంది. రిసార్ట్స్ లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఎంగేజ్ మెంట్ కు షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మంగళవారం నాడే షర్మిలకు ఏపీసీసీ పగ్గాలు అప్పజెప్పింది AICC. దాంతో ఆమె రెండు మూడు రోజుల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నారు.