NEGGEDEVARU – GUDIVADA : గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదా ? రాము ఈసారి టఫ్ ఫైట్ ఇచ్చారా?
టీడీపీ (TDP) ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టుకున్న నియోజకవర్గాల్లో గుడివాడ ముందు వరుసలో ఉంది. 2004లో టీడీపీ తరపున మొదటిసారి పోటీ చేసి… గెలిచారు కొడాలి నాని. 2009లో కూడా రెండోసారి టీడీపీ తరపున గెలిచినా… తర్వాత వైసీపీ (YSRCP) లో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు. గుడివాడ నుంచి వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ మంత్రి వర్గంలో మూడేళ్ళు మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం, చంద్రబాబుపై దూకుడుగా వ్యవహరించారు.