PAVAN PRAJADRBAR : ఇది కదా జనం కోరుకుంది.. గబ్బర్ సింగ్ ఆన్ డ్యూటీ
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే పవన్ కల్యాణ్ తన డ్యూటీ స్టార్ట్ చేశారు. తనకు కేటాయించిన నాలుగు కీలక శాఖలకు సంబంధించి రివ్యూలు చేపట్టారు. అధికారులకు తగిన ఆదేశాలు కూడా ఇస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు ఏకంగా 10 గంటల పాటు వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు పవన్.