YSR CP Party : వైసీపీలో సిద్ధమవుతున్న ఐదో లిస్ట్.. ఈసారి ఐదుగురు ఎంపీలు ఔట్ ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) మరోసారి విజయం సాధించడానికి వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan).. వరుసగా నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్నారు. ఇప్పటికి నాలుగు లిస్టులు విడుదల చేశారు. వీటిల్లో మొత్తమ్మీద 68 మంది దాకా ఎంపీ, ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పులు, చేర్పులు జరిగాయి. ఇంకా కొన్ని జిల్లాల సంగతి తేలలేరు. దాంతో ఇంకో లిస్ట్ ఉంటుందా.. తమని కూడా మారుస్తారా ? అని టెన్షన్ లో ఉన్నారు కొందరు వైసీపీ నేతలు.