TDP NO RAJYASABHA : వాళ్ళని నమ్ముకొని పోటీయా ? ఈసారి రాజ్యసభ వద్దనుకున్న బాబు
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరమవుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. తమ పార్టీకి బలం లేకపోగా… వైసీపీ రెబల్స్ పై ఆశలు పెట్టుకొని పోటీకి దిగడం కరెక్ట్ కాదన్నారు చంద్రబాబు. నామినేషన్లకు గురువారం చివరి తేదీ. దాంతో రాజ్యసభ ఎన్నికల్లో దిగడంపై కొందరు లీడర్లు బాబును కలిశారు. ఆ సంగతి పక్కన పెట్టాలనీ… వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల మీద దృష్టిపెట్టాలని పార్టీ నాయకులకు సూచించారు చంద్రబాబు.