Hardik Pandya: కెప్టెన్సీ రేసులో పాండ్యాకు పోటీ.. శుభ్‌మన్ గిల్‌తోపాటు రేసులోకి మరో స్టార్ ప్లేయర్
ఈ క్రమంలో రోహిత్ వారసుడిని తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పలువరు మాజీ క్రికెటర్‌లు అభిప్రాయపడ్డారు. కాగా భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్ కెప్టెన్సీపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ కోసం ఇద్దరు ఆటగాళ్ల పేర్లను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు.