Bandi Vs Etela: బండి, ఈటల మధ్య విభేదాలు.. బీజేపీకి నష్టం తప్పదా? ఇది కూడా కాంగ్రెస్‌లా మారుతుందా?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. పలు సందర్భాల్లో ఇవి బయటపడ్డాయి. బండి సంజయ్-ఈటల మధ్యే కాదు.. బండికి ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విజయశాంతి వంటి పలువురు నేతలతో విబేధాలున్నాయి.