Penamalure TDP : అందరూ పెనమలూరుకే ఎందుకో ? టీడీపీలో మొదలైన వర్గపోరు !
పెనమలూరు (Parthasaradhi) టీడీపీ (TDP) అభ్యర్థుల లిస్ట్ చాంతాడులా పెరిగిపోతోంది. అక్కడ పోటీ చేయాలని తమకు తాముగా ఉబలాటపడుతున్నవారు కొందరైతే… సర్లే… పెనమలూరులో చూద్దామని పార్టీ పెద్దలు ఆశపెడుతున్నవాళ్ళు మరికొందరు. దీంతో అందరికీ అదే ఎందుకన్న చర్చ మొదలైంది. వేరే చోట టిక్కెట్ దక్కే అవకాశాలు కూడా లేని వారి పేర్లు కూడా పెనమలూరు లిస్ట్ లో కనిపించడం లోకల్ హాట్ టాపిక్ అయింది.