IPL 2023: ఢిల్లీకి చెల్లుతుందా? రాజస్థాన్ టార్గెట్ చేస్తున్న ప్లేయర్?
ఐ పి ఎల్ 2023 సీజన్లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచుల్లో ఒకటి గెలిచి, రెండోది ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లో ఓడి, తీవ్ర ఒత్తిడిలో ఉంది. రెండు జట్లలో కూడా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నా కూడా, బ్యాటింగ్ కి సంబంధించి, ఒక రెండు వికెట్లు పడగానే, పేక మేడలా మొత్తం కూలిపోవడం ఆలోచించుకోవాల్సిన విషయమే.