TDP LEADERS TENSION : టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు… బీజేపీ బాంబు ఎవరిపై పడుతుందో…
టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నాయుడు బిజెపి (BJP) తో ఒప్పందం పెట్టుకుని తిరిగి వచ్చేసారు. రేపో మాపో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) వాటాగా కొన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేయడమే ఇక ఆలస్యం. చంద్రబాబు (Chandrababu) నిర్ణయం పార్టీలో చాలామందికి మింగుడు పడటం లేదు. ఐదేళ్లపాటు పార్టీని కాపాడుకుంటూ, పార్టీని నమ్ముకుంటూ అష్ట కష్టాలు పడి ఎన్నికల వరకు వస్తే… ఇప్పుడు చంద్రబాబు వెళ్లి 8 ఎంపీ సీట్లు బిజెపికి ఇస్తానని చెబుతూ…ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం టిడిపిలో సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.