Ukraine: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో కొత్త మలుపు-భారీ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ పేల్చివేత..దీని వెనుక ఉన్నదెవరు ?
యుద్ధం తారాస్థాయికి చేరింది. సంవత్సరంన్నర కాలంగా సాగుతున్న ఘర్షణ వాతావరణం మళ్లీ వేడెక్కింది. బాంబుల మోతలు, డ్రోన్ దాడులకు భిన్నంగా ఈసారి భారీ కట్టడాల పేల్చివేత వరకూ వచ్చింది. ఉక్రెయిన్ -రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని మరింత పెంచేలా కీలక పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద డ్యామ్‌ను పేల్చివేశారు.