Cricket: ఓపెనింగ్ సెర్మనీలో స్టార్స్ ఎవరో తెలుసా
ఐపీఎల్ 16వ సీజన్ కు ఇంకా వారం రోజులే సమయముంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీల సన్నాహాల్లో బిజీగా ఉంటే.. క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఎప్పటిలానే స్వదేశీ, విదేశీ స్టార్ ప్లేయర్స్ రెండు నెలలకు పైగా క్రికెట్ వినోదాన్ని అందించబోతున్నారు. మార్చి 31న జరగనున్న ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.