Break Up

Vidakula rings : విడాకులకూ ఉంగ‌రాలు వ‌చ్చేసాయి..

Vidakula rings : విడాకులకూ ఉంగ‌రాలు వ‌చ్చేసాయి..

ఎంగేజ్‌మేంజ్ రింగ్ గురించి అంద‌రికీ తెలిసిందే.. ఇద్ద‌రి వ్య‌క్తుల వివాహానికి ముందు జ‌రిపే ఈ వేడుక‌లో ఎంగేజ్‌మెంట్ రింగ్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ఈ రింగ్ అబ్బాయి, అమ్మాయి చేతికి ఉంటే.. వారి జీవితంలో మరొకరికి ప్రవేశం లేదని చెప్పడానికి అది సంకేతం.. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.

పెళ్లిల్లు, ఎంగేజ్‌మెంట్లను ఎంత గ్రేండ్‌గా సెల‌బ్రేట్‌గా చేసుకుంటున్నారో.. విడాకుల‌ను కూడా అదే రేంజ్‌లో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు కొంద‌రు. ఈ టైమ్‌లో ఇప్పుడు డివోర్స్ రింగ్స్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చాయి. అమెరికన్ మోడల్ ఎమిలీ రతాజ్కోవ్స్కహాప్ ‘డివోర్స్ రింగ్స్’ చూపిస్తూ సోషల్ మీడియాలో విడాకులు ప్రకటించింది. దీంతో.. ఇప్పుడు ఇది హాట్‌టాపిక్‌గా మారింది.