Delhi liquor case, Kavita : కవితకు ఎన్ని ఏళ్లు జైలు శిక్ష పడబోతోంది?
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. కోర్టు ముందు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ఇంట్లో ఐటీతో కలిసి సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత కవితకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. విచారణ కోసం 10రోజుల రిమాండ్ కోరారు.