Avinash Reddy: అవినాశ్ విచారణలో సీబీఐకి ఇన్ని కష్టాలా.. లోపం సంస్థలోనా.. చట్టాల్లోనా ?
సీబీఐ.. దేశంలోని అత్యున్నత సంస్థల్లో ఒకటి. కేసు ఏదైనా.. నేరం ఎలాంటిదైనా.. రాష్ట్రం పరిధి దాటి సీబీఐ చేతుల్లోకి వెళ్లిందంటే.. అతి తక్కువ సమయంలో అంతు చూస్తారనే పేరు ఉంది. ఐతే ఇదంతా ఒకప్పుడు ! సీబీఐ రోజురోజుకు అభాసుపాలవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు.. సీబీఐని రాజకీయం కోసం వాడుకుంటున్నాయని.. సీబీఐని రాజకీయాలు కమ్మేశాయని.. పంజరంలో చిలకలా సీబీఐ మారిందనే విమర్శలు ఉన్నాయ్.