18 ఏళ్ళకే వరల్డ్ ఛాంపియన్, చెస్ జగజ్జేత గుకేశ్
ప్రపంచ చదరంగంలో మరో శకం మొదలైంది. 18 ఏళ్ళ వయసులోనే వరల్డ్ చెస్ ను శాసిస్తున్నాడు భారత్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు… ఈ యువ సంచలనం తాజాగా వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. పిన్న వయసులోనే విశ్వవిజేతగా నిలిచిన చెస్ ప్లేయర్ గా రికార్డులకెక్కాడు.