Somesh Kumar: సోమేష్ కుమార్ నియామకంపై విపక్షాల ఫైర్ ఆయన మీద కేసీఆర్‌కు ఎందుకంత ప్రేమ ?
ఆయనది ఈ రాష్ట్రం కాదు.. ఈ కేడర్ కాదు.. ఐనా సార్ అసలే వదట్లేదు ఎందుకో మరి ! సోమేష్ కుమార్ ఎపిసోడ్లో కేసీఆర్ తీరు చూసి ఇప్పుడు అందరు అనుకుంటున్న మాటలివే ! తెలంగాణకు సీఎస్‌గా పనిచేసి.. ఆ తర్వాత ఏపీకి వెళ్లి.. అక్కడ ఇమడలేక వీఆర్ఎస్ తీసుకొని మళ్లీ హైదరాబాద్ వచ్చేశారు సోమేష్. ఇలా వచ్చారో లేదో.. ఆయనకో పదవి కట్టబెట్టారు కేసీఆర్. తెలంగాణ సీఎంకు ప్రధాన సలహాదారునిగా తీసుకున్నారు.