Telangana Cabinet Decisions: ఇక TS బదులు… TG… రాష్ట్ర గేయంగా జయ జయహే తెలంగాణ…!
తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లకు TS బదులు ఇకపై TG గా చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ ను రాష్ట్ర గేయంగా ఆమోదించింది. తెలంగాణలో రాజరికపు పోకడల నుంచి విముక్తి కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ లో అనేక నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.