China Secret Police Stations: ఇతర దేశాల్లో చైనా సీక్రెట్ పోలీసు స్టేషన్లు.. డ్రాగన్ కంట్రీ బరితెగింపు!
చైనాలో కూడా పోలీసింగ్ వ్యవస్థ ఉంది. అయితే అది చైనాకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చైనా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఒక దేశం మరో దేశంలో పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయడమేంటి అనిపిస్తోంది కదూ. కచ్చితంగా తన పరిధిని దాటి ఏదేశమైనా మరో దేశంలో పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయకూడదు.