Telangana CM : తెలంగాణ సీఎం అభ్యర్థి ఖరారు.. నేడు హైదరాబాద్ కి సీల్డ్ కవర్
తెలంగాణ నూతన సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. ఈరోజే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని, సాయంత్రం లోపు సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు పంపిన పార్టీ పరిశీలకుల నివేదికను పరిశీలించి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీలో పలువురు సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం సీఎం పేరును ప్రకటిస్తామని చెప్పారు.