Karnataka CM Politics: సిద్ధరామయ్య బలాలు ఇవే.. శివకుమార్‌కు పదవి దూరం చేసింది ఇవే..
కర్ణాటక సీఎం ఎవరు అన్న విషయంలో ఉత్కంఠకు తెరపడింది. కన్నడ రాజ్యానికి కాబోయే సీఎం ఎవరో హైకమాండ్ నిర్ణయించింది. అంతా అనుకున్నట్టే సిద్ధరామయ్యను మరోసారి కర్ణాటకకు సీఎంను చేసింది. ఇదే విషయాన్ని సాయంత్రం అధికారికంగా ప్రకటించబోతోంది కాంగ్రెస్ హై కమాండ్. రేపు కంఠీరవ స్టేడియంలో కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటే మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.