Corona: టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్.. 24 గంటల్లో 10,158 కొత్త కేసులు..
కరోనా అవుట్‌బ్రేక్ ఇండియాను మరోసారి షేక్ చేస్తోంది. కంట్రోల్ లేకుండా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రెండు వారాల మందు వరకూ వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేలల్లో వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 10 వేల 158 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజెంట్ ఇండియాలో ఉన్న యాక్టివ్ కరోనా కేసుల కౌంట్ 44 వేల 998కి చేరింది. రికార్డ్ స్థాయిలో ఒకే రోజు 19 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. నిన్న కూడా సుమారు 7 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి.