CPM : తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే సీపీఎం పోటీ.. 14 అభ్యర్థుల తొలి జాబితా విడుదల..
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమ తమ ఎన్నికల వ్యూహాలను మార్చుకుంటున్నాయి. నిన్న, మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేస్తామని కుండ బద్దలు కొట్టి చెప్పిన టీడీపీ, వైఎస్ఆర్ టీపీ లు అసలు పోటికే దూరంగా ఉంటున్నాయి. ఇక తాజాగా కమ్యూనిష్టు పార్టీ అయిన సీపీఎం ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో ఒంటరిగా దిగుతున్నట్లు ప్రకటించింది.