Manipur Violence: మణిపూర్లో అసలు ప్రభుత్వం ఉందా..? ఈ స్థాయిలో రాజ్యాంగ వ్యవస్థల వైఫల్యమా..? తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సుప్రీం
మణిపూర్ ప్రభుత్వంపైనా, పోలీసు వ్యవస్థపైనా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించింది. మణిపూర్లో కొన్ని నెలలుగా చోటు చేసుకున్న దారుణ ఘటనలపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.