box office dinosaur : ప్రభాస్ నువ్వు బాక్సాఫీస్ డైనోసార్
తాజాగా విడుదలైన ‘సలార్’ భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే దీనిపై పలువురు సినీ ప్రముఖులు రివ్యూ ఇవ్వగా.. తాజాగా చిరంజీవి ‘సలార్’పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నటీనటులతో పాటు చిత్రబృందాన్ని అభినందించారు. ‘‘దేవా పాత్రతో ఆకట్టుకున్న ప్రభాస్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘సలార్ సీజ్ ఫైర్’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది.