RADISON CASE : ఆలస్యమైతే తప్పించుకోవచ్చా? క్రిష్ గాయబ్ కి కారణం ఇదేనా…
రాడిసన్ డ్రగ్స్ కేసు (Radisson Drug Case)లో పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదరైంది. శుక్రవారం వస్తానని చెప్పిన డైరక్టర్ క్రిష్ (Director Krish) … హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ముంబైలో షూటింగ్ బిజీలో ఉన్నందున రాలేకపోతున్నట్టు దర్యాప్తు అధికారులకు చెప్పిన క్రిష్… ఉన్నట్టుండి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించి షాక్ ఇచ్చారు.