Jagan : పవన్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు.. జగన్
తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు దక్కకపోవడంపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పలాస సభలో పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగులు కొట్టాడు.. ఈ మ్యారేజీ స్టార్. ఆంధ్రాకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా ? అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు.. డిపాజిట్లు కూడా దక్కలేదు అంటూ జగన్ పవన్ కల్యాణ్ ను ఎద్దేవా చేశారు.