Delhi: లిక్కర్ స్కామ్‌లోకి సుఖేష్ చంద్రశేఖర్.. ఎవరితను.. బీఆర్ఎస్తో సంబంధం ఏంటి ?
ఢిల్లీ నుంచి గల్లీ వరకు లిక్కర్ స్కామ్ రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో.. మరింత చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి కేసు భారీ ట్విస్ట్ కనిపించింది. సుఖేష్ చంధ్రశేఖర్ అనే ఖైదీ.. బాంబ్ పేల్చాడు. ఇప్పటికే 2వందల కోట్ల హవాలా కేసులో అరెస్ట్ అయి.. తీహార్ జైల్లో ఉన్న సుఖేష్.. బీఆర్ఎస్, ఆప్ పార్టీలపై పెద్ద బాంబ్ పేల్చాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా 75కోట్ల గుట్టు విప్పేశాడు. ఇదంతా బీఆర్ఎస్ ఆఫీసులోనే జరిగిందంటూ కొన్ని విషయాలు బయటపెట్టాడు.