Sharad Pawar: శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ వల్లేనా? లేక డ్రామానా?
కొంతకాలంగా ఎన్సీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు, అదే పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన అన్న కొడుకు అజిత్ పవార్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చి, బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.