Election Notification

Rajasthan: రాజస్థాన్‌లో ముసలం.. కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులే.. ప్రగతిశీల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దిశగా సచిన్ పైలెట్

Rajasthan: రాజస్థాన్‌లో ముసలం.. కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులే.. ప్రగతిశీల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దిశగా సచిన్ పైలెట్

తెగేవరకూ లాగితే ఏమవుతుందో.. ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్‌లో అదే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే ఇక తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని.. సచిన్ పైలెట్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ముఖ్యమంత్రి గెహ్లాట్‌తో ఉన్న రాజకీయ పంచాయితీని పరిష్కరించడంలో గానీ, తన డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంలో గానీ పార్టీ హైకమాండ్ విఫలమైందని భావిస్తున్న సచిన్ పైలెట్.. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుబోతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చేందుకు సచిన్ పైలెట్ వర్గం సిద్ధమవుతుంది. వేరు కుంపటి పెట్టుకుని కాంగ్రెస్‌తో ఢీకొట్టేందుకు సచిన్ పైలెట్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.