Aroori Ramesh: టెన్షన్.. టెన్షన్.. మాజీ ఎమ్మెల్యేను ఎత్తుకెళ్లిన ఎర్రబెల్లి..
తనతో వెళ్లేందుకు రమేష్ సుముఖంగా లేకపోయినా.. ఆయనను కారులో ఎక్కించుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు దయాకర్ రావు. సరిగ్గా పెంబర్తిలో ఎర్రబెల్లి కారును బీజేపీ నేతలు అడ్డుకున్నారు. తమ పార్టీలో జాయిన్ కావాల్సిన వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారంటూ కారుకు అడ్డంగా నిలబడ్డారు.